Hosanna Ministries Manoharuda (మనోహరుడ) Album || Nee Prema Naalo (నీ ప్రేమ నాలో) Song Lyrics

Singer | .... |
నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపారతు నిన్నే
సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే “నీ ప్రేమ నాలో”
1. చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2)
హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో”
2. నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా
నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో”
3. నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో”
Comments